‘ఆచార్య’ కూడ తలొగ్గక తప్పలేదు

Published on Apr 20, 2021 1:00 am IST

కోవిడ్ సెకండ్ వేవ్ సినిమాల విడుదలనే కాదు షూటింగ్లను కూడ ఇరకాటంలో పడేస్తోంది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిసినా చాలామంది ధైర్యం చేసి షూటింగ్స్ జరుపుతూ వచ్చారు. ఒకవేళ లాక్ డౌన్ పడితే ఆలోపు షూటింగ్ ముగించేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నం కావొచ్చని అనుకున్నారు. కానీ వారి ప్లాన్స్ అన్నీ తలకిందులు అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని పెద్ద సినిమాలతో పాటు ఇటీవల మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ షూట్ ఆగిపోయింది. తాజాగా ఆ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ కూడ ఆగిపోయిందట.

ఇన్నాళ్లు చిరు, కొరటాల శివ గ్యాప్ లేకుండా వర్క్ చేస్తూ వచ్చారు. రామ్ చరణ్ సైతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో ఉన్నప్పటికీ తరచూ ‘ఆచార్య’ కోసం డేట్స్ కేటాయిస్తూ వచ్చారు. అయినా కోవిడ్ తాకిడి ఎక్కువ కలవడంతో షూటింగ్ వాయిదావేయక తప్పింది కాదు. ప్రజెంట్ చరణ్ మీద ఒక ఫైట్ షూటింగ్ జరుగుతోంది. అది పూర్తయ్యాక పూర్తిగా షూటింగ్ నిలిపివేస్తారట. ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ వాయిదాపడిన సంగతి తెలిసిందే. మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :