“ఆచార్య” కూడా అప్పటికే ఫిక్స్ అయ్యి ఉన్నాడా.?

Published on Jun 6, 2021 5:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం అన్ని పరిస్థితులు బాగానే ఉంటే గత మే నెల లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ వలన వాయిదా వేసిన అనేక చిత్రాలతో పాటుగా ఈ చిత్రం కూడా వాయిదా పడింది. మరి ఈ చిత్రం విడుదల ఎప్పుడు అన్నదానిపై ఆ మధ్య ఓ బజ్ వచ్చింది.

దాని ప్రకారం ఈ చిత్రం ముందు నుంచి అనుకుంటున్న దసరా రేస్ కే ఫిక్స్ అయ్యి ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే ఆగష్టు లో కూడా ఛాన్సెస్ ఉన్నాయని మరో టాక్ ఉంది. మరి వేచి చూడాలి ఏం జరగనుందో.. ఇక భారీ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :