ఆచార్య నుండి ప్రస్తుతానికి కాజల్ ని పక్కన పెడతారా?

ఆచార్య నుండి ప్రస్తుతానికి కాజల్ ని పక్కన పెడతారా?

Published on Apr 24, 2020 3:00 AM IST

లొక్డౌన్ అంత కంతకు పెరుగుతూ పోతున్న నేపథ్యంలో చిత్రాల షూటింగ్స్ మొదలైయ్యే సూచనలు కనిపించడం లేదు. మే నుండి అయినా షూటింగ్స్ మొదలవుతాయని నమ్మకంతో ఉన్న దర్శక నిర్మాతలకు పరిస్థితులను చూస్తుంటే అది జరిగేలా లేదు. దీనితో కొందరు ప్రత్యేక అనుమతులతో సెట్స్ లో ఇండోర్ షూటింగ్స్ జరుపుకోవడం బెటర్ అని భావిస్తున్నారట. అలాగే చిరంజీవి 152 వ చిత్రంగా వస్తున్న ఆచార్య టీమ్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ముంబైలో ఉన్న నేపథ్యంలో ఆమె హైదరాబాద్ లో షూట్ కి హాజరు కావడం కష్టం. ఈ నేపథ్యంలో ప్రస్తుతాని ఆమె లేని సన్నివేశాలు చిత్రీకరించాలని దర్శకుడు కొరటాల భావిస్తున్నారట. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక కాజల్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరిపే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆచ్యార టీమ్ ప్లాన్ ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు