శ్రీరామనవమికి మెగా ట్రీట్ ఫిక్స్ !

Published on Mar 31, 2020 1:00 am IST

టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న ఆచార్య సినిమా నుండి ఏప్రిల్ 2వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతుందని మేము ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం శ్రీరామ నవమికే ఆచార్య ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతుంది. మొత్తానికి నవమికి మెగా ట్రీట్ ఫిక్స్ అయింది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట.

కాగా ఈ సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారు. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. ఇటివలే ఆ పాట‌ను షూట్ చేశారు. పాట చాల బాగా వచ్చిందట. మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారట. ఇప్పటికే మణిశర్మ ఈ చిత్రానికి ట్యూన్లను కూడా సిద్ధం చేశారు. ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది. మొత్తంగా చెప్పాలంటే మెగాస్టార్ – కొరటాల నుండి ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రానుంది.

సంబంధిత సమాచారం :

X
More