మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’(Peddi) పై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమాకు పనిచేస్తున్న యాక్షన్ కొరియోగ్రాఫర్ మైబామ్ నబాకాంత మీటీ సోషల్ మీడియా వేదికగా ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.
ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ఒక ‘ఫైర్ స్టార్మ్’ లాగా ఉండబోతున్నాయని, బాక్సాఫీస్ వద్ద ఈ యాక్షన్ విజువల్స్ సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తాయని ఆయన పేర్కొన్నారు. మైబామ్ నబాకాంత మీటీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘పెద్ది’లో రామ్ చరణ్ కోసం అత్యంత పవర్‌ఫుల్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను ప్లాన్ చేసినట్లు ఈ అప్‌డేట్ ద్వారా స్పష్టమవుతోంది.
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డ్రామా కావడంతో ఈ యాక్షన్ సీన్లు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఈ చిన్న హింట్ మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శివ రాజ్‌కుమార్, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.


