తను అసలు హీరోనే కాదంటున్న యాక్షన్ హీరో !

Published on Jul 1, 2018 12:49 pm IST

గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతవుతున్న హీరో గోపిచంద్ హిట్స్, ఫ్లాప్స్ తో పనిలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పంతంతో కలిపి మొత్తం 25 సినిమాలు పూర్తి చేశాడు. ఓ యాక్షన్ హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాధించుకున్నప్పటికీ తను అసలు హీరోనే కాదని, కేవలం ఓ నటుడ్నేనని.. తనని హీరోగా చూపించిన దర్శకులే నిజమైన హీరోలు అంటూ తన దర్శకుల మీద ప్రశంసలవర్షం కురిపించాడు.

పంతం సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో తనతో సినిమాలను తీసిన దర్శకులందర్నీ గోపీచంద్ ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని గౌరవించాడు. ఇక ‘పంతం’ చిత్రం ప్రోమోలు చూస్తుంటే గోపిచంద్ ఈ చిత్రంతో విజయం సాధించేలా కనిపిస్తున్నాడు. మంచి సోషల్ కాజ్ తో గోపించంద్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా పంతం చిత్రాన్ని తెరకెక్కించారట. తన సినిమా టైటిల్ విషయంలో చివరన సున్నా వచ్చే సెంటిమెంట్ ను ఈ చిత్రంతోనూ కంటిన్యూ చేస్తున్న గోపీచంద్ ఈసారైనా భారీ విజయం సాధిస్తాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :