వేరే లెవల్ కి చేరుకున్న ‘ఖాకి’ యాక్షన్ సన్నివేశాలు !
Published on Nov 19, 2017 4:07 pm IST

కార్తి తాజా చిత్రం ‘ఖాకి’ గత శుక్రవారం 17వ తేదీన విడుదలై మంచి టాక్ తో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న అంశాల్లో కథ, కథనాలతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇంటర్వెల్ సమయంలో వచ్చే 5 నిముషాల పోలీస్ ఛేజింగ్ సీన్ తో పాటు ద్వితీయార్థంలో వచ్చే బస్ పై ఫైటింగ్ సీన్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

అంతేగాక క్లైమాక్స్ లో వచ్చే పోరాటంలో వాడిన తోడేలు వేట టెక్నిక్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. వాస్తవంగా హవేలీలు వాడే ఈ పద్దతిని స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరామన్ కంపోజ్ చేసిన విధానం చాలా బాగుందని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. దర్శకుడు వినోత్ 1995, 2005 ల మధ్య కాలంలో నిజంగా జరిగిన కేసును తీసుకుని, లోతుగా రీసెర్చ్ చేసి ఈ సినిమాను రూపొందించారు. అందుకే చిత్రంలో సహజత్వం ఎక్కువగా కనిపిస్తూ ఆడియన్సును ఆకట్టుకుంటోంది.

 
Like us on Facebook