జపాన్ లో సల్మాన్ లేటెస్ట్ భారీ చిత్రం రిలీజ్

జపాన్ లో సల్మాన్ లేటెస్ట్ భారీ చిత్రం రిలీజ్

Published on May 3, 2024 11:11 AM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రాల్లో తన అవైటెడ్ సీక్వెల్ చిత్రం “టైగర్ 3” కూడా ఒకటి. యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నుంచి వచ్చిన ఈ చిత్రం తమ స్పై యూనివర్స్ లో భాగంగా “పఠాన్”, “వార్” ల తర్వాత వచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ పరంగా గత రెండు సినిమాల రేంజ్ లో పెర్ఫామ్ చేయలేదు. దీనితో ఈ సినిమా యావరేజ్ గానే నిలిచింది.

అయితే మన ఇండియన్ సినిమాలు జపాన్ లో ఎప్పటికప్పుడు ఆనవాయితీగా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అలా ఇప్పుడు టైగర్ 3 కూడా జపాన్ లో రిలీజ్ కి వెళ్లినట్టుగా మేకర్స్ తెలిపారు. అక్కడ ఈ చిత్రం హిందీలోనే జపాన్ సబ్ టైటిల్స్ తో విడుదల అయ్యింది. మరి ఈ చిత్రం అక్కడ ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ నటించగా మనీష్ శర్మ దర్శకత్వం వహించారు అలాగే ఇమ్రాన్ హష్మి పవర్ ఫుల్ విలన్ రోల్ లో నటించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు