‘నా పేరు సూర్య’లో రోమాలు నిక్కబొడుచుకునే యాక్షన్ సీన్స్ !

14th, April 2018 - 11:53:09 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య’. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే సినిమాను మాస్ కంటెంట్ తో పకడ్బందీగా రూపొందిస్తున్నారట వక్కంతం వంశీ. బన్నీ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ మేజర్ హైలెట్ గా నిలుస్తాయని, ప్రతి యాక్షన్ సీన్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుందని నిర్మాతలు అంటున్నారు.

ఇంతకుముందు విడుదలైన రెండు టీజర్లను చూస్తే కూడ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీఠ వేయడం జరిగిందని ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పటికే సినిమా నుండి మూడు పాటలు విడుదలకాగా పూర్తి ఆడియోను 22న విడుదలచేసి ప్రీ రిలీజ్ వేడుకను 29న నిర్వహించనున్నారు. అను ఇమ్మాన్యుయేల్ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రం మే 4న ప్రేక్షకుల ముందుకురానుంది.