రెండు పాత్రలలో బాలయ్య బీభత్సమేనట..!

Published on Dec 4, 2019 8:23 am IST

బాలయ్య రూలర్ గా థియేటర్లలో దిగడానికి కేవలం ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది. ఈనెల 20న రూలర్ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. కాగా బాలకృష్ణ ఈ చిత్రంలో రెండు భిన్న గెటప్స్ లో కనిపిస్తున్నాడు. ఒక పాత్రలో బిజినెస్ టైకూన్ లా కనిపిస్తుండగా మరొక పాత్రలో సీరియస్ పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. ఐతే రెండు పాత్రలలో బాలయ్య విశ్వరూపం ఒక రేంజ్ లో ఉంటుందట. రెండు పాత్రలకు కూడా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ దర్శకుడు తెరకెక్కించడం జరిగిందట. బాలయ్య భీకర పోరాటాలు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించేలా ఉంటాయట.

బాలయ్య ఈ సారి హిట్ కొట్టడం ఖాయం అని గట్టిగా వినిపిస్తుంది. సీనియర్ దర్శకుడు కె ఎస్ రవికుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే రూలర్ చిత్రం నుండి యాక్షన్ హీరో అనే ఒక సాంగ్ విడుదల కాగా నేడు మరో సాంగ్ విడుదల అవుతుంది. సంగీత దర్శకుడు చిరంతన్ భట్ రూలర్ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More