వెబ్ సిరీస్ చేయనున్న ఆ స్టార్ హీరో?

Published on Jul 29, 2021 12:40 pm IST


కరోనా వైరస్ లాక్ డౌన్ కారణం గా ఓటిటి బాట పట్టారు ప్రేక్షకులు. థియేటర్లు లేకపోవడం తో ఓటిటి కి బాగా క్రేజ్ పెరిగింది అని చెప్పాలి. అయితే ఈ నేపథ్యం లో స్టార్ హీరోలు సైతం ఈ ఓటిటి ద్వారా పలు కార్యక్రమాలను, వెబ్ సిరిస్ లను చేస్తున్నారు. అయితే తమిళ స్టార్ హీరో అయిన ఆర్య ఒక వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఓటిటి లోకి అడుగు పెట్టేందుకు సిద్దం అయినట్లు తెలుస్తుంది. ఒక యాక్షన్ వెబ్ సిరిస్ ను అమెజాన్ ప్రైమ్ విడియో కోసం చేయనున్నారు.

అయితే ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. ఒక ప్రముఖ దర్శకుడు ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్య ఇప్పటికే సార్పట్ట చిత్రం తో సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :