మహేష్ లుక్ పై బండ్ల గణేష్ కామెంట్

Published on May 17, 2020 11:49 am IST

నటుడు నిర్మాత బండ్ల గణేష్ మహేష్ లేటెస్ట్ లుక్ పై సూపర్ కామెంట్ వదిలాడు. సర్.. మీరు హాలీవుడ్ స్టార్ హీరోలా ఉన్నారని ట్విట్టర్ లో మహేష్ ఫోటోతో పాటు కామెంట్ పెట్టారు. మహేష్ తన పిల్లలు గౌతమ్, సీతారలతో దిగిన ఓ సెల్ఫీ ఫోటోని సోషల్ మీడియాలో పంచుకోగా, ఫొటోలో మహేష్ లుక్ పై బండ్ల గణేష్ ఇలా కామెంట్ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అవుతున్న మహేష్ నీట్ అండ్ క్లీన్ షేవ్ లో కనిపిస్తున్నారు. ఐతే ఆయన జుట్టు మాత్రం కొంచెం పెంచారు.

ఇక ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ మరో చిత్రాన్ని ప్రకటించలేదు. ఆయన తన తదుపరి చిత్రం గీత గోవిందం డైరెక్టర్ పరుశురామ్ తో చేస్తున్నారని తెలుస్తుంది. ఈనెల 31న సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు కావడంతో ఆ రోజున దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందని మహేష్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ తరువాత రాజమౌళి మహేష్ తో మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు.

సంబంధిత సమాచారం :