“రాజమనార్” పాత్ర పై జగపతి బాబు కీలక వ్యాఖ్యలు!

Published on Aug 23, 2021 1:30 pm IST


పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సలార్. ఈ చిత్రం ను ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన అనంతరం నుండి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది. తాజాగా ఈ చిత్రం నుండి జగపతి బాబు పాత్ర ను చిత్ర యూనిట్ రివీల్ చేయడం జరిగింది. రాజమనార్ పాత్ర ను రివీల్ చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్ అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది.

ఈ చిత్రం లో జగపతి బాబు ఎంత భయంకరం గా ఉన్నారు అనేది ఈ లుక్ ను చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం నుండి విడుదల అయిన తన లుక్ పై జగపతి బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తన బెస్ట్ వర్స్ట్ లుక్ ఎవర్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ పాత్రను తనకు ఇచ్చినందును దర్శకుడు ప్రశాంత్ నీల్ కి, హీరో ప్రభాస్ కి, నిర్మాత విజయ్ కిరగందూర్ కి మరియు హాంబలే ఫిలిమ్స్ కి థాంక్స్ తెలిపారు. ఈ చిత్రం కోసం తన బెస్ట్ ఇవ్వడానికి ప్రశాంత్ నీల్ తో సహకరిస్తా అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రం నుండి విడుదల అవుతున్న లుక్స్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :