రామ్ క్రేజీ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన మాధవన్.!

Published on Jun 12, 2021 3:02 pm IST

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఎన్ లింగుసామి దర్శకత్వంలో ఒక పక్కా మాస్ ఎంటర్టైనెర్ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన మాస్ స్టార్డం తర్వాత రామ్ చేపట్టిన మరో మాస్ కాంబో కావడంతో దీనిపై సాలిడ్ అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై గత కొన్నాళ్లుగా ఓ గాసిప్ వైరల్ అవుతుంది.

కోలీవుడ్ విలక్షణ సీనియర్ నటుడు మాధవన్ ఈ చిత్రంలో స్ట్రాంగ్ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడని టాక్ రాగా దానిపై మాధవన్ క్లారిటీ ఇచ్చారు. “నిజంగా లింగుసామి డైరెక్షన్ లో చెయ్యాలని తనకి కూడా ఇష్టం ఉందని కానీ ఇప్పుడు తాను ఓ తెలుగు సినిమాలో విలన్ గా నటిస్తున్నానన్న వార్తల్లో మాత్రం ఎలాంటి నిజం లేదని” సింపుల్ క్లారిటీ ఇచ్చేసారు. దీనితో మాధవన్ ఈ ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో లేరని కన్ఫర్మ్ అయ్యిపోయింది.

సంబంధిత సమాచారం :