పవన్ కళ్యాణ్ తీసుకున్నే నిర్ణయాలే రాష్ట్రానికి దిక్సూచి !

Published on Mar 24, 2019 10:55 am IST

ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు సీనియర్ నరేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికరమైమన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయంగా తీసుకున్నే నిర్ణయాలు రాష్ట్రానికి దిక్సూచిగా ఉంటాయనే నమ్మకం తనకుందని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. పవర్ స్టార్ గురించి నరేష్ ఇంకా మాట్లాడుతూ.. ఒక కామన్ మేన్ గా పవన్‌ కళ్యాణ్ చేసే సేవను తానూ ఎప్పుడూ అభిమానిస్తానని.. పవన్ ఒక నిజాయితితో సమాజంలో మార్పు తీసుకురావటానికి యోగిలా తిరుగుతున్నారని నరేష్ చెప్పుకొచ్చారు.

ఇక ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు శివాజీరాజీ – నరేష్‌ ప్యానల్స్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. పోటీలో మా అధ్యక్షుడిగా నరేశ్‌‌ విజయం సాధించిన విషయమూ తెలిసిందే. శివాజీ రాజా పై ఆయన 69 ఓట్ల ఆధిక్యంతో నరేష్ గెలుపొందారు.

సంబంధిత సమాచారం :

More