లేటెస్ట్ వీడియో : వివాహం చేసుకున్న నరేష్, పవిత్ర లోకేష్

Published on Mar 10, 2023 7:30 pm IST

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ వికె నరేష్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక సీనియర్ నటిగా పవిత్ర లోకేష్ కూడా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకున్నారు.

అయితే విషయం ఏమిటంటే గత కొన్నాళ్లుగా సహజీవనం సాగిస్తున్న వీరిద్దరూ నేడు ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకున్న వీడియోని నరేష్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. పలువురు కుటుంబీకులు, శ్రేయోభిలాషుల సమక్షంలో వైభవంగా జరిగిన వీరిద్దరి పెళ్లి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :