మణిరత్నం క్రియేషన్ లో వచ్చిన నవరస వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం ప్రసారం అవుతోంది. అయితే నవరసాలను తొమ్మిది ఎపిసోడ్ లుగా తెరకెక్కించడం పట్ల నవరస టీమ్ పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో ప్రతిభావంతులు అయి, గొప్ప మనసు ఉన్న వారు ఈ నవరస కోసం పని చేశారు అని తెలిపారు. ఒక నవరస మీకు, మాకు అందరికీ ఒక అర్థవంతమైన ఎమోషనల్ జర్నీ అంటూ చెప్పుకొచ్చారు. అయితే నెట్ ఫ్లిక్స్ లో అంథాలజీ చిత్రం ప్రసారం అవుతోంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ నవరస ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుండటం తో ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.