ఇంటర్వ్యూ : ప్రియదర్శి – ఈ పాత్ర చేయడానికి మల్లేశంగారి నుండే స్ఫూర్తి పొందాను !

Published on Jun 20, 2019 10:03 pm IST

చేనేత కార్మికుడు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘చింతకింది మల్లేశం’ జీవితం ఆధారంగా రాజ్ ఆర్ దర్శకత్వంలో యంగ్ కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “మల్లేశం”. కాగా ప్రియదర్శికి జోడిగా అనన్య నటించన ఈ సినిమాలో జూన్ 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా హీరో ప్రియదర్శి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

అసలు నటన వైపు మీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది ?

నేను ఓ గ్రాఫిక్స్ కంపెనీలో జాబ్ చేస్తుండేవాడ్ని. అయితే ఆ కంపెనీ కొన్ని ఆర్ధిక ఇబ్బదుల కారణంగా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి వెళ్ళింది. దాంతో ఆ కంపెనీ వాళ్లు శాలరీ ఇచ్చి పంపించేయడం జరిగింది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ లో నటించాను. వాటిల్లో కొన్ని యూట్యూబ్ లో బాగా సక్సెస్ అయ్యాయి. దాంతో ఆ షార్ట్ ఫిల్మ్స్ పట్టుకుని సినిమాల ఛాన్స్ లు కోసం రెగ్యులర్ గా ఆడిషన్స్ కి వెళ్తుండేవాడ్ని. అలా సినిమాల వైపు నా ప్రయాణం మొదలైంది.

దర్శకుడు తరుణ్ భాస్కర్ మీ కెరీర్ ను మలుపు తిప్పారు ? తనతో మీ జర్నీ సినిమాలకు ముందే మొదలైందా ?

తరుణ్ భాస్కర్ తో కలిసి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్స్ ఆధారంగానే ఓ నిర్మాత తన సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత బొమ్మల రామారం అనే చిత్రంలో విలన్ ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఘాజీ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సమయంలోనే పెళ్లి చూపులుకు ఆడిషన్స్ చేశాను. అలా తరుణ్ నాకు పెళ్లి చూపులు సినిమాలో అవకాశం ఇచ్చారు.

మీకు ఎలాంటి పాత్రలు చేయాలని ఆశ పడుతున్నారు ?

నేను ఎక్కువుగా పంచ్ లు వేసే పాత్రలనే చేయాలని అనుకునేవాడిని. కానీ మల్లేశం స్క్రిప్టు చదివాకా ఆ అభిప్రాయం మారింది. ఒక నటుడికి ఒకే రకమైన ఇమేజ్ ఉండటం అనేది శాపమే. అందుకే నాకంటూ ఒక ఇమేజ్ ఉండాలని నేను కోరుకోవడంలేదు. నాతొ సహా నేను నటుల్ని ఎప్పుడూ కొత్త కోణంలో చూడాలనుకుంటాను.

ఈ సినిమా గురించి చెప్పండి ?

సినిమాలో మదర్ సెంటిమెంట్‌ తో పాటు ఒక జీవితానికి సంబంధించి స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్ ఉంది. సినిమా ఎక్కువుగా 1992 నుంచి 1999 వరకూ సాగుతుంది. మల్లేశంగారి ఆ ఏడేళ్ల జీవితాన్నే హైలెట్ చేస్తూ సినిమా తీయడం జరిగింది. అయితే సినిమాలో ఒక సామాన్య వ్యక్తి గొప్ప ఆవిష్కరణకు పూనుకోవడనేది ఎంతో స్ఫూర్తివంతంగా అనిపిస్తోంది.

మల్లేశం పాత్ర గురించి చెప్పండి ?

మల్లేశంగారి నుండే స్ఫూర్తి పొంది.. అచ్చం ఆయనలానే నటించేందుకు ప్రయత్నించాను. ఖచ్చితంగా మల్లేశం పాత్రలో నన్ను మీరు పూర్తి డిఫరెంట్ గా చూస్తారు. అలాగే ఈ సినిమాలో చాలా వరకు ఒరిజినల్ లైఫ్ ని చూపిస్తున్నాము.

ఈ చిత్ర దర్శకుడు రాజ్ ఆర్ గురించి ?

ఆయన ఎంతో ఫ్యాషన్ తో కష్టపడి ఈ సినిమా చేశారు. మల్లేశంగారి కథ గురించి అన్ని పూర్తిగా తెలుసుకుని ప్రతి అంశాన్ని చాల స్పష్టంగా అర్ధం చేసుకొని ఈ సినిమాను తీశారు.

సంబంధిత సమాచారం :

More