ఆకట్టుకుంటున్న “కుడి ఎడమైతే” రాహుల్ లుక్!

Published on Jul 5, 2021 8:08 pm IST

తెలుగు సినీ పరిశ్రమలో ఓటిటి బాట ద్వారా ఎన్నో వెబ్ సిరీస్ లు ప్రేక్షకులకు అభిమానులకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే అమలా పాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా వెబ్ సిరీస్ కుడి ఎడమైతే. ఈ వెబ్ సిరీస్ జూలై 16 వ తేదీ నుండి ఆహా వీడియో లో అందుబాటులోకి రానుంది. అయితే లూసియా, యూ టర్న్ లాంటి సూపర్ హిట్ సినిమా లను అందించిన దర్శకుడు పవన్ కుమార్ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ విఘ్నేష్ ఈ వెబ్ సిరీస్ కి స్క్రీన్ ప్లే అందించారు.

అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి రాహుల్ విజయ్ పాత్ర ను విడుదల చేసింది. ఈ సీరీస్ లో ఆది పాత్ర లో డెలివరీ బాయ్ గా కనిపించనున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :