రాజేంద్ర ప్రసాద్ ‘ఓ బేబీ’ ని ఆకామెడీ క్లాసిక్ తో పోల్చారు.

Published on Jun 30, 2019 12:14 pm IST

సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకతంలో తెరకెక్కిన మూవీ “ఓ బేబీ”. విక్టరీ వెంకటేష్, రానా అతిధులుగా నిన్న ప్రీ రిలీజ్ వేడుక నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర చేసిన విషయం తెలిసిందే. నిన్న ప్రీ రిలీజ్ వేదికపై మాట్లాడిన ఆయన సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘అహనా పెళ్ళంట’ మూవీ తరువాత మళ్ళీ ఇన్నేళ్లకు ‘ఓ బేబీ’ మూవీతో అదే బ్యానర్ లో ఆయన నటిస్తున్నారట. ‘అహనా పెళ్ళంట’ మూవీ వచ్చి ఇన్నేళ్లకాలంలో మళ్ళీ ఆ సంస్థలో సినిమా చేయకపోవడానికి కారణం ఆ స్థాయి సినిమా,పాత్ర కోసం ఎదురు చూడడం వలెనే అన్నారు. ‘ఓ బేబీ’ చిత్రంలో తన పాత్ర ఆ స్థాయిలో ఉంటుంది అని చెప్పారు. ఓ బేబీ మూవీకి కారణభూతులైన సమంత,దర్శకురాలు నందిని రెడ్డి, అలాగే నిర్మాతల పై ప్రశంసలు కురిపించారు రాజేంద్ర ప్రసాద్.

సంబంధిత సమాచారం :

More