యాక్టర్ తో రైటర్ కి నిశ్చితార్థం !

Published on Apr 22, 2019 8:20 am IST

శాండిల్‌వుడ్‌ చెందిన ఓ నటుడు ఓ రచయిత్రిని వివాహమాడబోతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ‘పరేషన్‌ అలమేలమ్మ’ అనే చిత్రం ద్వారా శాండిల్‌వుడ్‌ కు నటుడుగా పరిచయమైన రిషి, రైటర్‌ స్వాతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ మేరకు వారి నిశ్చితార్థం జరిగింది.

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ లోని ఫ్యామిలీ మెంబర్స్ మధ్య రిషి, స్వాతి తమ నిశ్చితార్ధాన్ని నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ విషయం గురించి నటుడు రిషి సోషల్ మీడియాలో తెలుపుతూ… ‘నన్ను ప్రోత్సహిస్తున్న మీ అభిమానం ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సంఘటనతో నా జీవితంలో ఒక మైలు రాయిని దాటాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు జోడి దొరికింది. మా నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరిగింది. అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా’ అని పోస్టు చేశారు.

సంబంధిత సమాచారం :