రజనీ, కమల్‌ హాసన్‌పై సత్యరాజ్ ఫైర్

Published on Jun 10, 2019 7:08 pm IST

తమిళ రాజకీయాలకు, అక్కడి సినిమా స్టార్లకు ఎంతటి దగ్గర సంబంధం ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇటీవల మరణించిన కరుణానిధి, జయలలిత వంటి ఉద్దండులు సినిమా రంగం నుండి వచ్చినవారే. వారి కోవలోనే తాజాగా కమల్ హాసన్, రజనీకాంత్ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. ఇప్పటికే కమల్ మక్కల్ నీది మయ్యం పార్టీ పెట్టి ఎన్నికల్లో కూడా పాల్గొనగా త్వరలో రజనీ సైతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగన్నారు.

దీనిపై తాజాగా స్పందించిన నటుడు సత్యరాజ్ వారు ఇరువురి పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. తమిళ రాజకీయాల్లో శూన్యత ఏర్పండిందని రాజకీయాల్లోకి వచ్చిన కమల్, రజనీకాంత్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న ఆయన డీఎంకే లాంటి వేళ్ళూనుకుపోయిన పార్టీని పెకలించాలని అనుకోవడం మూర్ఖత్వమని, రాజకీయాలు చేయడానికి చాలామంది ఉన్నారని, ఎవరి పని వారు చూసుకుంటే మంచిదని అన్నారు. సత్యరాజ్ ఇంత ఘాటుగా స్పందించడం ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

సంబంధిత సమాచారం :

More