తారక్ కి థాంక్స్ చెప్పిన తిమ్మరుసు…ఎందుకంటే?

Published on Jul 28, 2021 6:39 pm IST

సత్యదేవ్ లాయర్ రామ చంద్ర పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తిమ్మరుసు. ఈ చిత్రం లో సత్యదేవ్ కి జోడీగా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల అయింది. టాలీవుడ్ ప్రముఖ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసారు. అయితే ఈ ట్రైలర్ కి ఊహించిన దానికంటే భారీ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇందుకు కారణం జూనియర్ ఎన్టీఆర్ అంటూ కొందరు అంటున్నారు.

ఈ మేరకు హీరో సత్యదేవ్ సోషల్ మీడియా ద్వారా తారక్ కి థాంక్స్ చెప్పారు. థాంక్ యూ డియర్ తారక్ అన్నా అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రం ట్రైలర్ 4 మిలియన్ ప్లస్ వ్యూస్ కి పైగా సొంతం చేసుకుంది.శరణ్ కోప్పి శెట్టి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం జులై 30 వ తేదీన థియేటర్ల లో విడుదల కి సిద్దం అయింది.

సంబంధిత సమాచారం :