షూటింగ్ లో లైటింగ్ సూరిబాబు ఏం చేశాడో చూడండి!

Published on Aug 29, 2021 4:17 pm IST


కరుణా కుమార్ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరోగా, ఆనంది హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ చిత్రం ఆగస్ట్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం కి సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ రావడం తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. తాజాగా హీరో సుధీర్ బాబు ఈ చిత్రం కోసం ఏం చేశాడు అనేది ఒక చిన్న వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. బోట్ మోటార్ స్టార్ట్ చేస్తూ సుధీర్ ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రం లో లైటింగ్ సూరిబాబు సెట్స్ లో బెస్ట్ గా చేసాడు అంటూ చెప్పుకొచ్చారు.

సుధీర్ బాబు హీరోగా, ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో సుధీర్ లైటింగ్ సూరిబాబు పాత్రలో నటించగా, ఆనంది శ్రీదేవి పాత్ర లో నటించడం జరిగింది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించారు. ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా మరియు శశి దేవి రెడ్డి లు నిర్మించారు.

సంబంధిత సమాచారం :