“ది టుమారో వార్” చిత్రం పై విజయ్ దేవరకొండ ఏమన్నారంటే?

Published on Jul 2, 2021 7:36 pm IST


అమెజాన్ ప్రైమ్ విడియో లో నేడు ది టుమారో వార్ చిత్రం డైరక్ట్ ఓటిటి గా విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో కూడా విడుదల అయింది. అయితే ఈ చిత్రం చూసిన టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ యాక్షన్, సైన్స్ ఫిక్షన్, కామెడీ చిత్రం అంటూ విజయ్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసినట్లు తెలిపారు. అయితే నేడు ఈ చిత్రం చూసినట్లు తెలిపారు. ఈ చిత్రం చూసి చాలా బాగా ఎంజాయ్ చేసినట్లు తెలిపారు. అయితే యాక్షన్ సినిమాలు చూసే వారు తప్పక చూడాలి అని, తెలుగు మరియు తమిళ భాషల్లో కూడా ఈ చిత్రం ఉందని అన్నారు.

అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో విజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుంది అని, మాకు విజయ్ సపోర్ట్ ఉందంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రం పై ప్రముఖ తమిళ నటుడు సూర్య సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం చూడటానికి ఆసక్తికరం గా, ఫన్ గా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :