విజయ్ సేతుపతి 25 లక్షలు విరాళం !

Published on Nov 19, 2018 5:40 pm IST

‘గజ తుఫాన్ ’ బీభత్సానికి తమిళనాడులోని దక్షిణ ప్రాంతం తీవ్రంగా దెబ్బతినగా.. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులతో అల్లాడిపోయారు. వారి బాధకి తమిళ్ సినీరంగ ప్రముఖులు తమవంతుగా ఆర్ధిక సహాయం చేయడం మొదలు పెట్టారు. గజ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి హీరో విజయ్ సేతుపతి తనవంతు సహాయంగా 25 లక్షల విలువ చేసే నిత్యావసర వస్తువులను, ఇతర సామాగ్రిని అందించారు.

కాగా, స్టార్ హీరో సూర్య కూడా తన ఫ్యామిలీ తరుపున ఇప్పటికే రూ.50 లక్షల రూపాయిలను విరాళంగా ప్రకటించారు. మిగిలిన తమిళ స్టార్ హీరోలు కూడా తమ వంతుగా విరాళాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ గజ తుఫాన్ కారణంగా తమిళనాడులోని డెల్టా ప్రాంతమంతా అతలాకుతలం అయిపోయింది.

సంబంధిత సమాచారం :

X
More