‘సరిలేరు నీకెవ్వరు’లో నటించట్లేదన్న అందాల భామ

Published on Sep 11, 2019 5:22 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మాస్ ప్రేక్షకుల కోసం ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని, అందులో మీనాక్షి దీక్షిత్ ఆడి పాడనుందని వార్తలు పుట్టుకొచ్చాయి. వీటిపై స్పందించిన మీనాక్షి.. ఆ సినిమాలో తాను చేయట్లేదని, మేకర్స్ తనను ఇంకా సంప్రదించలేదని చెప్పుకొచ్చింది. అలాగే మహేష్ బాబుతో మరోసారి వర్క్ చేసే అవకాశం వస్తే ఎవరు కాదనుకుంటారు అంటూ ట్వీట్ చేసింది.

మరోవైపు స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను తీసుకుంటున్నారనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ‘మహర్షి’ లాంటి విజయం తర్వాత మహేష్ ఏరికోరి చేస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇందులో మహేష్ బాబుకు జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా అలనాటి నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More