పవన్ కళ్యాణ్ తో నటించడానికి తొందరపడుతోన్న నటి !

10th, November 2016 - 09:00:15 AM

kat-heroine
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘కాటమరాయుడు’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని నానక్ రామ్ గూడలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ చిత్రంషూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లోని నటీ నటీలు ఒక్కొక్కరిగా సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు. వీరిలో చాలా వరకూ ఎప్పుడూ పవన్ తో పనిచేయని వారే కావడం విశేషం. పవన్ తమ్ముల్లుగా శివబాలాజీ, కమల్ కామరాజ్ ఇలా కొంతమంది నటులు కొంతమంది మొదటిసారి పవన్ తో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. అలాంటివారిలో నటి మానస హిమవర్ష కూడా ఉంది.

మొదట బుల్లితెరపై ఛాలెంజ్ అనే డాన్స్ షో ద్వారా వీక్షకులకు పరిచయమైన ఈమె మెల్లగా సినీ పరిశ్రమలో కెరీర్ ను బిల్డ్ చేసుకుంది. ‘రొమాన్స్’ వంటి చిత్రంలో నటించింది. అలా అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న ఆమెకు ‘కాటమరాయడు’ లో నటించే అవకాశం దక్కింది. ఈ విషయంపై మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందని, ఇప్పటికే తన షూటింగ్ మొదలుపెట్టేశానని, కానీ పవన్ కళ్యాణ్ గారితో ఇంకా నటించలేదని, ఆ టైమ్ కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆమె తెలిపింది. ఇకపోతే డాలి డైరెట్ చేస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.