ఆమె పేరు చెబితే సీతాదేవి పాత్ర గుర్తుకు వస్తుంది – పవన్ కళ్యాణ్

ఆమె పేరు చెబితే సీతాదేవి పాత్ర గుర్తుకు వస్తుంది – పవన్ కళ్యాణ్

Published on Nov 1, 2019 10:47 AM IST

pawan abt bhuma

ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలతో అలరించిన సీనియర్‌ నటి గీతాంజలి నిన్న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు. గీతాంజలి మృతి పట్ల పవన్ కళ్యాణ్ స్పందిస్తూ. ‘‘ప్రముఖ నటి గీతాంజలి గారి మరణం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. మన తెలుగు సినీ రంగంలోని సీనియర్ నటుల్లో గీతాంజలిగారు ఒకరు. ఆ పేరు చెబితే ‘సీతారామ కళ్యాణం’లోని ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి..’’ అనే పాటలోని సీతాదేవి పాత్ర గుర్తుకు వస్తుంది. తెలుగుతోపాటు పలు భాషల్లో నటించిన గీతాంజలి గారు వినోద ప్రధానమైన పాత్రల్లో తనదైన ముద్రను కనబరిచారు. మేము చెన్నైలో ఉన్నప్పుడు గీతాంజలి గారికి చెందిన శ్రీనివాస థియేటర్స్‌ లో వారి కుటుంబ సభ్యులను కలుస్తుండేవాళ్లం. హైదరాబాద్ వచ్చాక ఆ పరిచయం కొనసాగింది. వారి కుటుంబసభ్యులకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ అంటూ పవన్ సందేశాన్ని జనసేన పోస్ట్ చేసింది.

కాగా 1947లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన గీతాంజలి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లోనూ నటించారు. సీనియర్ హీరో రామకృష్ణను వివాహం చేసుకున్న గీతాంజలి అసలు పేరు మణి. 1961లో తొలిసారిగా సీతారామ కల్యాణం చిత్రంతో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. కాగా, ఆమె చివరి సినిమా దటీజ్‌ మహాలక్ష్మి. ఇక గీతాంజలి నంది అవార్డు కమిటీ మెంబర్‌గా కూడా పనిచేశారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు