అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన జ్యోతిక..!

Published on Sep 1, 2021 1:01 am IST

ప్రముఖ నటీమణి జ్యోతిక స్టార్ హీరో సూర్య భార్య అన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పలు సందేశాత్మకమైన సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న జ్యోతిక, తాజాగా ఆమె అభిమానులకు ఓ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఇన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న జ్యోతిక ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

అయితే తన ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫస్ట్ పోస్ట్ కు మంచి స్పందన వస్తుంది. ఆమె ఫస్ట్ పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే 1.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. అంతేకాదు ఆమె పెట్టిన ఫస్ట్ పోస్టుకు రెండు లక్షలకు పైగా లైక్‌ల వర్షం కురిసింది. నెటిజన్లు జ్యోతికకు సోషల్ మీడియాలోకి స్వాగతం చెబుతున్నారు. ఇక భార్య ఇన్‌స్టా ఎంట్రీపై నిన్న స్పందించిన సూర్య నిన్ను ఇన్‌స్టాలో చూసినందుకు థ్రిల్ అయ్యానని అన్నాడు.

సంబంధిత సమాచారం :