డైరెక్టర్ గా మారిన కబడ్డీ కబడ్డీ హీరోయిన్.

డైరెక్టర్ గా మారిన కబడ్డీ కబడ్డీ హీరోయిన్.

Published on Mar 9, 2020 11:02 AM IST

Kaveri Kalyani

రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘శేషు’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, కబడ్డీ కబడ్డీ, దొంగోడు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక ట్యాక్సీ వాలా, లెజెండ్, యాత్ర, గీత గోవిందం వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కూడా చేశారు. అనూహ్యంగా ఈ హోమ్లీ హీరోయిన్ డైరెక్టర్ అవతారం ఎత్తారు.

ఆమె దర్శకురాలిగా ఓ సినిమా తెరకెక్కుతుంది. చేతన్ చీను హీరోగా పరిచయమవుతూ తెరకెక్కుతునన్న ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో నిన్న విడుదల చేశారు. ఇంకా టైటిల్ నిర్ణయించాల్సి ఉండగా సైకోలాజికల్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన కళ్యాణి డైరెక్టర్ గా తన సత్తా చూపించనుంది.

తాజా వార్తలు