హ్యాక్ గురైన కియారా ట్విట్టర్ అకౌంట్

Published on Oct 10, 2019 2:00 am IST

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ గురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టా ద్వారా అభిమానులకు తెలియచేశారు.’నా ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌కు గురైయ్యింది. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించేందుకు నా టీం పనిచేస్తోంది. నా అకౌంట్‌ నుంచి వస్తున్న ట్వీట్లను ఎవరు పట్టించుకోకండి. అంతేకాకుండా నా ట్విటర్‌ అకౌంట్‌ నుంచి వస్తున్న లింక్‌లను క్లిక్‌ చేయవద్దు. ప్రస్తుతం నా ట్విటర్‌లో వచ్చిన లింక్‌ నేను పెట్టినది కాదు.’ అని కియారా ఇన్‌స్టా వేదికగా తెలిపారు.

సెలబ్రిటీల సోషల్‌మీడియా ఖాతాలు హ్యాక్‌ అవడం అనేది కొత్త విషయమేమి కాదు. గతంలో ఒకసారి బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, నటుడు షాహిద్ కపూర్‌ ట్విటర్‌ అకౌంట్లు హ్యాక్‌కి గురయ్యాయి.ఇక ఇటీవలే కబీర్ సింగ్ మూవీతో బంపర్ హిట్ అందుకున్న ఈమె లక్ష్మీ బాంబ్, గుడ్ న్యూస్, ఇందుకి జవానీ ఇలా మొత్తం ఐదు చిత్రాలలో నటిస్తున్నారు. తెలుగులో ఈమె మహేష్ హీరోగా వచ్చిన భరత్ అనే నేను, రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రాలలో నటించారు.

సంబంధిత సమాచారం :

X
More