హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సాగర్ సొసైటీలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘వెల్లింగ్టన్ ఇంటర్నేషనల్ స్కూల్’ (విష్) ప్రీ-స్కూల్‌ను ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి లాంఛనంగా ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు, చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ఈ పాఠశాల తన కార్యకలాపాలను ప్రారంభించింది.
ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. పిల్లల్లో సృజనాత్మకత, జిజ్ఞాస, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఇక్కడి విద్యా విధానాన్ని రూపొందించడం అభినందనీయమని కొనియాడారు.
స్కాండినేవియన్ అభ్యాస వాతావరణం, జపాన్ విద్యా విధానంలోని స్వతంత్రత, మైండ్‌ఫుల్‌నెస్, రెగ్గియో ఎమిలియా సూత్రాలను మేళవించి ఇక్కడి ప్రత్యేక పాఠ్యాంశాలను తీర్చిదిద్దినట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది. సురక్షితమైన, ఆనందకరమైన వాతావరణంలో చిన్నారులకు స్వతంత్రత, బాధ్యత, నాయకత్వ లక్షణాలు అలవాటు చేయడమే తమ ప్రధాన ధ్యేయమని ‘విష్’ వ్యవస్థాపకురాలు దీప్తి చిట్కారా, సహ వ్యవస్థాపకుడు మనవ్ పురి స్పష్టం చేశారు.


