భర్త పై నటి మళ్ళీ ఫిర్యాదు !

Published on Jul 5, 2021 3:42 pm IST

తమిళ నటి రాధ తన రెండో భర్త పై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనని కొట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. లాస్ట్ టైమ్ కూడా రాధ ఇలాగే పిర్యాదు చేసింది. అయితే ఆ తరువాత వీరిద్దరూ కలిసిపోయారు. తమ సమస్యను పరిష్కరించుకున్నారు. కొన్నాళ్ళు పాటు తమ దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడిపినప్పటికీ వీరి మధ్య మళ్ళీ గొడవలు మొదలయ్యాయి.

దాంతో ఆమె శనివారం మరోసారి భర్త పై స్థానిక వరంగమలై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి మళ్ళీ వార్తల్లో నిలిచింది. తన భర్త, ఆయన మిత్రులతో కలిసి తన పై బెదిరింపులకు పాల్పడుతున్నారనేది రాధ ప్రధాన ఆరోపణ. అసలు రాధ తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తన కొడుకు, తల్లితో కలిసి ఆమె సంతోషంగా జీవిస్తోంది. కానీ కొద్ది నెలల క్రితం వసంత రాజాను రెండో వివాహం చేసుకుని మళ్ళీ కష్టాలు కొనితెచ్చుకుంది.

సంబంధిత సమాచారం :