సమీరా రెడ్డి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూస్తుందంట.

Published on Jun 3, 2019 2:27 pm IST

సమీరా రెడ్డి ఒకప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్ గా స్టార్ హీరోస్ పక్కన వరుసపెట్టి సినిమాలు చేసింది. తెలుగు లో ముఖ్యంగా ఎన్టీఆర్ తో ‘నరసింహుడు’, ‘అశోక్’,అలాగే మెగాస్టార్ తో ‘జై చిరంజీవ’ లో కలిసి నచించారు. బాలీవుడ్లో కూడా సినిమాలు చేసిన సమీరా కెరీర్ మంచి స్థితిలో ఉన్నప్పుడే 2014 లో ఓ బిజినెస్ మెన్ ని పెళ్లిచేసుకొని సినిమాలకు దూరమైంది.

ఇప్పటికే ఓ కొడుకు ని కన్నసమీరా మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఓ మహిళా అవగాహనా కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చిన సమీరా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. తన కెరీర్, మ్యారేజ్, సినిమా రీఎంట్రీ వంటి విషయాలపై అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే మీరు ఎవ్వరి సినిమాలు ఎక్కువగా చూస్తారు అన్న ప్రశ్నకు తాను నటించిన ఎన్టీఆర్ సినిమాలు చూస్తాను అని చెప్పి ఎన్టీఆర్ తో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంది సమీరా. అలాగే సూర్య సన్ అఫ్ కృష్ణన్ మూవీ కూడా తానూ చూస్తూ ఉంటుందని చెప్పింది.

సంబంధిత సమాచారం :

More