మహేష్ బాబు ఛాలెంజ్ ను స్వీకరించిన శృతి హాసన్

Published on Aug 12, 2020 9:42 pm IST


రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ఊహించని రీతిలో అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వాములు అయ్యారు. ఒకరి కొకరు ఛాలెంజ్ లు విసురుకుంటూ మొక్కలు నాటుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టిన రోజు వేడుక సందర్భంగా మొక్కలు నాటారు. ఆ తర్వాత నటుడు విజయ్, నందమూరి తారక రామారావు, శృతి హాసన్ లకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసిరారు.

అయితే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సైతం శృతి హాసన్ కి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరగా, నేడు ఛాలెంజ్ ను స్వీకరించి చెన్నై లోని తన నివాసం లో మూడు మొక్కలు నాటారు శృతి హాసన్.అయితే తనను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి నామినేట్ చేసినందుకు గానూ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి మరియు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలిపారు. అయితే చివరగా మరో ముగ్గురికి శృతి హాసన్ ఛాలెంజ్ ను విసిరారు. అందులో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, తమన్నా భాటియా, రానా దగ్గుబాటి ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More