సినిమా కోసం గాయనిగా మారిన మరొక నటి !
Published on Mar 11, 2018 5:52 pm IST


ఈ మధ్య కాలంలో కొందరు హీరోయిన్లు తమ సినిమాల కోసం తామే గొంతు సవరించుకుని పాటలు పాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి హీరోయిన్ల జాబితాలోకి అదా శర్మ కూడ చేరిపోయింది. 2016లో తెలుగులో ‘క్షణం’ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈమె ఆ తర్వాత హిందీ సినిమాలపై ఎక్కువ దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఈమె ‘చార్లి చాప్లిన్-2’ అనే సినిమాతో తమిళంలో కూడ అడుగుపెట్టనుంది.

అంతేగాక ఈ చిత్రం యొక్క టైటిల్ సాంగ్ ను కూడా అదా శర్మ పాడటం విశేషం. అదా శర్మ సరదగా తన ఇన్స్టాగ్రమ్ అకౌంట్లో పాట పాడి పోస్ట్ చేసిన ఒక వీడియోను తిలకించిన ‘చార్లి చాప్లిన్’ నిర్మాతలు టైటిల్ సాంగ్ ఆమె పాడితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో పాడించారట. చాలా కాలంపాటు కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్న అదా శర్మ తమిళం ఎలాగూ తన మాతృ భాషే కాబట్టి పాడేసిందట. ఇకపోతే శక్తి డైరెక్ట్ చేస్తున్న దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభు దేవా ప్రధాన పాత్రలు కనిపించనున్నాడు.

 
Like us on Facebook