“ఆడవాళ్లు మీకు జోహార్లు” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Published on Apr 2, 2022 3:02 am IST

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ డ్రామా “ఆడవాళ్లు మీకు జోహార్లు”. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న థియేటర్లలో విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కి సిద్దమయ్యింది. సోనీ లివ్ ప్లాట్‌ఫారమ్‌లో ఏప్రిల్ 14 నుండి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం :