సమీక్ష : అద్దం – తెలుగు సిరీస్ “ఆహా”లో ప్రసారం

సమీక్ష : అద్దం – తెలుగు సిరీస్ “ఆహా”లో ప్రసారం

Published on Oct 16, 2020 3:52 PM IST

నటీనటులు: జయప్రకాష్, రోహిణి, ఎం.ప్రవీన్, ప్రసన్న, గౌతమ్ సుందరరాజన్, అభిరామి వెంకటాచలం, డాక్టర్ పవిత్ర మరిముత్తు, వరలక్ష్మి శరత్‌కుమార్, అర్జున్ చిదంబరం, స్మృతి

దర్శకుడు: సర్జున్ కి.మీ, భరత్ నీలకాంతన్, శివ అనంత్

నిర్మాతలు: సుజాత నారాయణన్, దేవసేన ఇ.ఎస్

డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫి : షెల్లీ

సంగీత దర్శకుడు: కె. సుందరమూర్తి

 

ఈ లాక్ డౌన్ సమయంలో పలు చిత్రాలు మరియు సిరీస్ ల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో నేడు మేము ఎంచుకున్న వెబ్ సిరీస్ “అద్దం”. మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇపుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఈ తెలుగు వెబ్ సిరీస్ లో మొత్తం మూడు విభిన్నమైన కథలతో కూడి ఉంటుంది. మొదటిది ఒక సాధారణ లారీ డ్రైవర్(జయ ప్రకాష్) తన భార్య(రోహిణి) వారికి ఒక కొడుకుతో సామాన్య జీవితం సాగిస్తుంటారు. ఇక రెండో దానికి వస్తే ఒక బాగా డబ్బున్న వ్యక్తి(ప్రసన్న) తన భార్యతో జీవనం పై విసుగు చెంది ఓ కాల్ గర్ల్ తో ఉంటాడు. ఇక మూడో కథకు వస్తే (వరలక్ష్మి శరత్ కుమార్) ఒక మానసిక వైద్యురాలు ఒక పేషెంట్ (కిషోర్ కుమార్) ను డీల్ చేస్తుంది. ఇలా మూడు భిన్నమైన కథలు ఎలా ముగిసాయి? ఈ సిరీస్ ద్వారా మేకర్స్ ఏం చెప్పదలచుకున్నారు అన్నది మెయిన్ పాయింట్.

 

ఏం బాగుంది?

 

ఈ సిరీస్ లో మొదటిగా బాగా నచ్చే అంశం ఏదన్నా ఉంది అంటే ఈ సిరీస్ ను తెరకెక్కించిన నిర్మాణ విలువలు అని చెప్పాలి. ప్రతీ ఎపిసోడ్ లో కనిపించే విజువల్స్ చాలా బాగా అనిపిస్తాయి. అలాగే మంచి కెమెరా వర్క్ వలన చూడ్డానికి మరింత సౌకర్యంగా అనిపిస్తుంది. అంతే కాకుండా సిరీస్ లో ప్రతీ సన్నివేశానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది.

ఇక మెయిన్ లీడ్స్ కు వస్తే తమిళ్ లో టాలెంట్ నటి అయిన వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి తన రోల్ ను ఫుల్ ఫిల్ చేసారు. ఒక మానసిక వైద్యురాలిగా మంచి ఈజ్ నటన కనబరిచింది. అలాగే మరో రోల్ లో కనిపించిన ప్రసన్న మంచి అవుట్ ఫుట్ ను ఇచ్చారు. అలాగే అతనిపై డిజైన్ చేసిన స్టోరీ రెండో ఎపిసోడ్ లో సంభాషణలు చాలా బాగా అనిపిస్తాయి. వీరితో పాటుగా మరో కీలక రోల్ లో కనిపించిన పవిత్ర మరిముత్తు తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేకూర్చింది.

 

ఏం బాగోలేదు?

 

ఈ సిరీస్ ద్వారా దర్శకులు మంచినే చెప్పే ప్రయత్నం చేసారు. మనుషుల మధ్య ఉండే విలువలు, నైతికత ను ఉద్దేశించి మంచి మూవ్ చేసారు. కానీ దానిని ఆవిష్కరించే విధానంలో కాస్త ఆసక్తికరంగా మలచి ఉంటే బాగుండేది. పైగా స్టోరీస్ కూడా కాస్త షార్ట్ గా అనిపించడం చాలా వరకు ఆడియెన్స్ కు కన్ఫ్యూజ్ గా అనిపించొచ్చు.

అంతే కాకుండా కథలోని సారాంశం అంతా అర్ధం అవ్వడానికి చాలా సమయమే పడుతుంది. అలాగే ఈ సిరీస్ లోని కథను బాగానే మొదలు పెట్టినా సరైన ముగింపును మాత్రం అందివ్వలేకపోయారు. ఒక్క నటీనటుల పెర్ఫామెన్స్ ను పక్కన పెడితే దర్శకుడు చెప్పాలి అనుకున్న ఫిలాసఫీ అంత క్లారిటీగా ఉండదు అనిపించదు. వీటి మూలాన ఎమోషన్స్ ఏమంత ఆకట్టుకోవు.

 

చివరగా:

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “అద్దం” అనే సిరీస్ తో బేసిక్ విలువలను చూపించే ప్రయత్నం చేసారు. టాలెంటెడ్ నటీనటుల ఎంపిక వారి నుంచి డీసెంట్ పెర్ఫామెన్స్ లు అలాగే నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి, కానీ సరైన ముగింపు లేకపోవడం. ఆకట్టుకోని కథనం,ఎమోషన్స్, బోరింగ్ గా తెరకెక్కించిన విధానం ఏమంత ఇంప్రెసివ్ గా అనిపించవు. ఈ వారాంతానికి ఈ సిరీస్ అంత వాచబుల్ జాబితాలో ఉంచుకోకపోవడమే బెటర్.

 

123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు