బాలీవుడ్ అవార్డు విన్నింగ్ మూవీ తమిళంలోకి

Published on Aug 16, 2019 7:10 pm IST

హీరో ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం అంధాదున్. ఆయుష్మాన్ ఖురానా అంధుడిగా నటించిన ఈ చిత్రం టబు, ఆయుష్మాన్ మధ్య ఆసక్తికరంగా సాగే క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది. గత సంవత్సరం విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో ఏకంగా మూడు విభాగాలలో అవార్డులు పొందడం జరిగింది. ఆయుష్మాన్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుపొందారు.

ఐతే ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయనున్నారు. సీనియర్ నటుడు నిర్మాత త్యాగరాజన్ ఈ మూవీ రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. కాగా ఈ చిత్రాన్ని సీనియర్ హీరో జీన్స్ ఫేమ్ ప్రశాంత్ హీరోగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. అంధాదున్ చిత్రంలో హీరో పియానో ప్లేయర్ గా కనిపిస్తారు.హీరో ప్రశాంత్ కి కూడా ఆ కళలో మంచి పట్టు ఉండటంలో ఈ మూవీకి ఆయనే మంచి ఛాయిస్ అని అనుకుంటున్నారు. అనుకున్న విధంగా జరిగితే కొద్దిరోజులలో ఈ మూవీ సెట్స్ పైకెళ్లే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :