ప్రస్తుతం మన దక్షిణాది నుంచి వస్తున్న భారీ చిత్రాల్లో “కేజీయఫ్ చాప్టర్ 2” వైబ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. అదిరిపోయే రేంజ్ లో ప్లాన్ చేసిన టీజర్ కు ఇంకా కొన్ని రోజుల గడువు మాత్రమే ఉండడంతో అన్ని భాషల్లోనూ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా మేకర్స్ గత కొన్ని రోజుల నుంచి కేజీయఫ్ మ్యాగజైన్ లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. వాటి ద్వారా కొన్ని కీలక పాయింట్స్ ను వారు వెల్లడి చేస్తున్నారు.
అలా లేటెస్ట్ గా విడుదల చేసిన మూడో మ్యాగజైన్ లో అధీరా ఎంత పవర్ ఫుల్లో వివరిస్తున్నారు. అలాగే అధీరా ఎలా బ్రతికాడు అన్న పాయింట్ ను కూడా హైలైట్ చేసి మరింత ఆసక్తి రాబట్టారు. గరుడపై కోపంతో అటాక్ చేయించినపుడు మిస్సవుతుంది. కానీ గరుడ అటాక్ చేసినపుడు మిస్ అవ్వదు. అయినా ఆ టైం లో అధీరా చావకుండా తప్పించుకుంటాడు అంటే అధీరాకు చావు లేదా?
అతడు ఓడిపోడా అతనికి ఎలాంటి నెట్వర్క్ ఉంది అన్నది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మరి గరుడని చంపాక రాకీ కేజీయఫ్ సామ్రాజ్యాన్ని తన సమ ఉజ్జి అయిన అధీరా నుంచి ఎలా పొందుతాడు వీళ్ళ మధ్య ఆ హై అండ్ యాక్షన్ ఎలా ఉంటుంది అన్నవి అధీరా ఎంత పవర్ ఫుల్ అనేది చెప్తున్నాయి. మరి ఆ రోల్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలా డిజైన్ చేసాడో అన్నది తెలియాలి అంటే చాప్టర్ 2 విడుదల అయ్యాకే చూడాలి.



