‘అదుగో’ అందరూ ‘బంటి’ గురించే !

‘అదుగో’ అందరూ ‘బంటి’ గురించే !

Published on Nov 6, 2018 3:22 PM IST

రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది. ట్రైలర్ లో బంటిని చూస్తుంటే.. సినిమా చాలా ఎంటర్ టైనింగ్ తో సాగుతుందని అర్ధమవుతుంది. ముఖ్యంగా బంటి చేస్తున్న రిస్కీ షాట్స్ ఆకట్టుకున్నే విధంగా ఉన్నాయి.

అయితే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువుగా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారట. రెండు నిముషాల ట్రైలర్ లో బాగానే చూపించారు, మరి ఈ పందిపిల్లతో సినిమా మొత్తం ఎలా మ్యానేజ్ చేసారని అందుగుతున్నారట. మొత్తానికి రవిబాబు ఈ చిత్రాన్ని రెండున్నర సంవత్సరాలు పాటు కష్టపడి రూపొందించినందుకు, ఈ చిత్రం బాగానే బజ్ క్రియేట్ అయింది.

పైగా విఎఫ్ఎక్స్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం మరియు లైవ్ యాక్ష‌న్ త్రీడీ సాంకేతిక‌తో రోపొందించడం వంటి అంశాలు ఈ చిత్రం పై అంచనాలను పెంచేశాయి. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు