వెరీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్న ఆది ‘బ్లాక్’ టీజర్.!

Published on Aug 7, 2021 10:19 am IST

టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ సినిమాలనే లైన్ లో పెడుతూ వస్తున్నాడు. మరి అలా చేస్తున్న మరో చిత్రమే “బ్లాక్”. దర్శకుడు జీబీ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది మాత్రం ఆది కెరీర్ లో వచ్చిన సినిమాల్లో మంచి ఆసక్తికరంగా ఉందని చెప్పాలి.

ఇంకా ఈ టీజర్ కోసం డీటెయిల్స్ లోకి వెళితే ఓ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉండేలా అనిపిస్తుంది. అంతే కాకుండా కనిపించని సస్పెన్స్ విలన్ కి హీరోకి నడిచే ఎంగేజింగ్ డ్రామాలా అనిపిస్తుంది. అంతే కాకుండా ఈ టీజర్ కట్ లో ఆది డైలాగ్స్ కూడా కొత్తగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి.

ఇంకా లాస్ట్ లో ఒక షాట్ కూడా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించారు. ఇంకా సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కూడా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఈ సినిమాని మంచిగా ప్రమోట్ చేసి వదిలితే ఆది కెరీర్ లో మంచి హిట్ గా నిలవొచ్చు.. ఇక ఈ చిత్రంలో ఆది సరసన దర్శన హీరోయిన్ గా నటిస్తుందా మహంకాళి సినిమాస్ బ్యానర్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :