“ఆదిపురుష్” మళ్ళీ అక్కడికే షిఫ్ట్..?

Published on Jun 13, 2021 11:41 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు భారీ చిత్రాల్లో దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న బై లాంగువల్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. మరి భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం షూట్ పై లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం 25 శాతం షూట్ కంప్లీట్ చేసుకుంది.

అయితే కరోనా రెండో దెబ్బకు మొత్తం ముంబై లో షూట్ ప్లాన్ చేసిన ఈ చిత్రం షూట్ మకాం 150 రోజులకు హైదరాబాద్ కు షిఫ్ట్ చేసారు. మరి ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ ఆ ప్లాన్ అంతా మళ్ళీ ముంబై కే షిఫ్ట్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. అలాగే ఆ షూట్ ను మేకర్స్ ఈ వచ్చే జూన్ కొన్ని రోజుల్లోనే స్టార్ట్ చేయనున్నారట.

మరి ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో నటిస్తుండగా కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ రావణ్ పాత్రలో నటిస్తుండగా సన్నీ సింగ్ లక్ష్మణ పాత్రలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :