“ఆదిపురుష్” నుంచి రేపు అదిరిపోయే అనౌన్స్‌మెంట్..!

Published on Feb 28, 2022 9:49 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం “ఆదిపురుష్”. మైథ‌లాజిక‌ల్ మూవీగా వ‌స్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమాపై దర్శకుడు ఓం రౌత్ ఓ అదిరిపోయే అప్డేట్‌ని ఇచ్చాడు.

రేపు ఉదయం 7 గంటల 11 నిమిషాలకు ఈ చిత్రానికి సంబంధించి ఓ అనౌన్స్‌మెంట్‌ని ఇవ్వబోతున్నట్టు తెలిపాడు. అయితే ఈ అనౌన్స్‌మెంట్ ఏమీ ఉంటుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే టీ సిరీస్, రెట్రోఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి కృతిస‌న‌న్ సీత పాత్రలో, సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్ర‌లో, బాలీవుడ్ న‌టుడు స‌న్నీ సింగ్ ల‌క్ష్మ‌ణుడి పాత్రలో, మ‌రాఠి న‌టుడు దేవ్‌ద‌త్త న‌గే హ‌నుమంతుడి పాత్ర‌లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :