అతి తక్కువ మందితో “ఆదిపురుష్” షూట్.?

Published on Apr 1, 2021 8:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “ఆదిపురుష్”. భారీ బడ్జెట్ తో రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రాన్ని. మరి ముంబైలో శరవేగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూట్ పై లేటెస్ట్ బజ్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంది. మరి అలా లేటెస్ట్ మరో ఆసక్తికర టాక్ ఇప్పుడు బయటకు వచ్చింది.

మరి దాని ప్రకారం ఇంత పెద్ద భారీ చిత్రాన్ని ఓంరౌత్ కేవలం 25 మంది సిబ్బంది తోనే షూట్ జరుపుతున్నారట. ప్రస్తుతం సిజి షాట్స్ ఉన్న భాగం తెరకెక్కిస్తున్నారట అందుకే అతి తక్కువ సిబ్బందితో కోవిడ్ ను దృష్టిలో పెట్టుకొని షూట్ ను జరుపుతున్నారట. మరి ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో సీతగా కృతి సనన్ నటిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 11న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :