ఇక్కడ “ఆదిపురుష్” షూట్ మొదలయ్యేది అప్పుడేనా?

Published on May 8, 2021 9:00 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న బిగ్ బడ్జెట్ చిత్రాల్లో దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ప్లాన్ ప్రకారం కొంత మేర షూట్ ముంబైలో కంప్లీట్ చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా మళ్ళీ కోవిడ్ పెరుగుతుండడంతో షూట్ కాస్తా హైదరాబాద్ కు షిఫ్ట్ చేసేసారు. ఏకంగా ఆదిపురుష్ టీం మకాం అంతా మూడు నెలలు ఇక్కడే ఉండనున్నారు.

దీనితో ఆ సంబంధిత పనులు జరుగుతుండగా అసలు ఈ షూట్ ఎప్పటి నుంచి స్టార్ట్ కానుంది అన్నది తెలుస్తుంది. మరి ఈ షూట్ వచ్చే మే 15 నుంచే స్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే హీరోయిన్ కృతి సనన్ వచ్చినట్టు కూడా టాక్ ఉంది. రామాయణం ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా కృతి సనన్ సీతగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో నటిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఆగస్ట్ 11న ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :