ప్రభాస్ లేకుండానే ‘ఆదిపురుష్’ షూటింగ్

Published on Jun 12, 2021 3:00 am IST

ప్రభాస్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముంబైలో లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే నిబంధనలు సడలుతుండటంతో షూటింగ్ మొదకుపెట్టుకునే వెసులుబాటు దొరికింది చిత్ర బృందానికి. ఈ జూన్ మధ్య నుండి సినిమా చిత్రీకరణను ముంబైలోని ఒక స్టూడియోలో మొదలుపెడతారట. రావణుడి పాత్ర చేస్తున్న సైఫ్ అలీఖాన్ మీద షూటింగ్ జరపనున్నారు. పూర్తిగా గ్రీన్ మ్యాట్ వేసి సిద్ధంచేసిన స్టూడియోలో షూటింగ్ జరుగనుంది.

దీని తరువాత షెడ్యూల్ హైదరాబాద్లోలోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. అయితే ఇందులో కూడ ప్రభాస్ పాల్గొన్నడం లేదు. ఈ రెండు షెడ్యూల్స్ ఆయన లేకుండానే జరుగుతాయట. ఇతర ముఖ్య తారాగణం ఇందులో పాల్గొంటారు. ఈలోపు ప్రభాస్ ‘సలార్’ సినిమా షెడ్యూల్ ముగించుకుని తర్వాతి షెడ్యూల్లో జాయిన్ అవుతారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృషన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో కృతి సనన్ కథానాయకిగా చేస్తుండగా లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, ఇతర భారతీయ భాషలతో సహా ఆంగ్లంలో కూడ విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :