డిజప్పాయింట్ చేసిన “ఆదిపురుష్” టీం.!

Published on Apr 21, 2021 7:21 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ నటిస్తున్న “ఆదిపురుష్”. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం పై ఎనలేని అంచనాలు కూడా ఉన్నాయి. అయితే మరి ఈరోజు రామనవమి పర్వదినం సందర్భంగా మేకర్స్ ఈరోజు ఉదయం 7 గంటల 11 నిమిషాలకు ఓ స్పెషల్ అప్డేట్ ఇస్తున్నాము అని తెలిపారు.

దీనితో అదేమిటా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ సేపు నిద్రలు కూడా లేకుండా ఆన్ లైన్ కి వచ్చేసారు. కానీ వారు అందరికీ నిరాశే మిగిలింది. దర్శకుడు నుచ్న్హి కానీ వారు టీం నుంచి కానీ అనుకున్న సమయానికి అప్డేట్ ఏది రాలేదు. దీనితో ఈ అప్డేట్ కోసం ఎదురు చూసిన ప్రతీ ఒక్కరు బాగా డిజప్పాయింట్ అయ్యారు. మరి మరో సమయానికి ఈ అప్డేట్ వస్తుందేమో చూడాలి. ఇక ఈ భారీ చిత్రంలో సైఫ్ మరియు సన్నీ సింగ్ తదితరులు నటిస్తుండగా వచ్చే ఏడాది ఆగష్టు 11న విడుదల చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం :