ఫోటో మూమెంట్: గ్రాండ్ గా ఆదిపురుష్ టీజర్ రిలీజ్ ఈవెంట్!

Published on Oct 2, 2022 10:28 pm IST

పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి పౌరాణిక చిత్రం ఆదిపురుష్‌ లో లార్డ్ రామగా కనిపించనున్నారు, ఇది జనవరి 12, 2023 న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ మెగా బడ్జెట్ చిత్రానికి తన్హాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు టీజర్‌ను లాంచ్ చేయడానికి అయోధ్యలో సరయు నదికి సమీపంలో ఒక భారీ కార్యక్రమం నిర్వహించారు.

ఆదిపురుష్ బృందం పట్ల తమ అభిమానాన్ని, ప్రేమను చూపించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిత్ర బృందం అభిమానులందరి ప్రేమను అంగీకరిస్తూ ఇక్కడ చిత్రంలో కనిపిస్తుంది. ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది, ఈ అద్భుతమైన రిసెప్షన్ తో రానున్న రోజుల్లో ఇలాంటి ఎన్నో ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం :